టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డైనోసర్‌లా నటించి అలరించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ రూమ్‌లో నడుచుకుంటూ వచ్చి డైనోసర్‌లా శబ్దం చేసిన వీడియోను తన భార్య అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది. దీనిపై మీమ్స్ తయారు చేశారు నెటిజన్లు. అవి ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా ఉన్నాయి.
'జురాసిక్ వరల్డ్'లో కోహ్లీ.. టీజర్ విడుదల! - విరాట్ కోహ్లీ లేటెస్ట్ న్యూస్
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డైనోసర్‌లా చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు మీమ్స్, వీడియోలు తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
కోహ్లీ డైనోసర్ వీడియోపై నెటిజన్లు మీమ్స్
కరోనా లాక్డౌన్ సమయంలో అనుష్క, కోహ్లీ.. తమ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. ఇటీవలే వీరిద్దరు కలిసి క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు. కోహ్లీ క్రీడాకారులతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్లలో పాల్గొంటున్నాడు. ఫిట్‌గా ఉండటానికి కసరత్తులూ చేస్తున్నాడు. ఇటీవలే వెయిట్ లిఫ్టింగ్ వీడియోను బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ సహచరుడు, స్నేహితుడైన ఏబీ డివిలియర్స్‌తో పాటు అభిమానులతో పంచుకున్నాడు.
ఇదీ చూడండి... డైనోసర్‌లా మారిన కోహ్లీ.. వీడియో వైరల్