తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్​గా కోహ్లీ భవితపై హుస్సేన్ జోస్యం - 'కెప్టెన్​గా కోహ్లీపై ఒత్తిడి ఉంటుంది'

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్​. ప్రస్తుత సిరీస్​లో సారథిగా అతడిపై కొంత ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. అయినా గెలవాలన్న అతడి దృక్పథంలో మాత్రం మార్పు ఉండదని పేర్కొన్నాడు.

Virat Kohli will be under pressure but has a winner's attitude: Nasser Hussain
'తొలి టెస్టులో కెప్టెన్​గా కోహ్లీపై ఒత్తిడి ఉంటుంది'

By

Published : Feb 4, 2021, 12:50 PM IST

Updated : Feb 4, 2021, 1:03 PM IST

ఇంగ్లాండ్​తో సిరీస్​లో తిరిగి టెస్టు కెప్టెన్సీ చేపట్టబోతున్న విరాట్​ కోహ్లీపై కాస్త ఒత్తిడి ఉంటుందని ఆ దేశ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ అతడు గెలుపు ధీమాతోనే ఉంటాడని అన్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్​ టెస్టు అనంతరం పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్​కు వచ్చాడు. మిగిలిన మూడు టెస్టులకు నాయకత్వం వహించిన ఆజింక్య రహానె.. బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి కెప్టెన్సీ పట్ల పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి టెస్టు సారథిగా అతడిని నియమించాలని సూచించారు.

"ఆస్ట్రేలియా సిరీస్​ను రహానె నాయకత్వంలో గెలిచింది టీమ్​ఇండియా. కానీ, విరాట్​ కోహ్లీ నింపిన స్ఫూర్తి కారణంగానే జట్టుకు ఇది సాధ్యపడింది" అని యూకే డైలీ మెయిల్​ కాలంలో నాసర్ రాసుకున్నాడు.

ఛేజింగ్​లో కోహ్లీకి అద్భుత రికార్డు ఉందని కితాబిచ్చాడు ఈ మాజీ ఇంగ్లాండ్​ కెప్టెన్​. తమ జట్టు అతనితో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో అతడొక పరుగుల యంత్రమని పొగిడాడు. 2014 ఇంగ్లాండ్​ పర్యటన మినహాయిస్తే అతని ఆట అద్భుతమని తెలిపాడు. అతడికి ఏ ఒక్క అవకాశం వచ్చినా చెలరేగిపోతాడని పేర్కొన్నాడు.

కెప్టెన్​గా కోహ్లీని తప్పించే అవకాశం..

కెప్టెన్​గా కోహ్లీని తప్పించాలన్న అభిప్రాయం కొన్ని నెలల క్రితం సాధ్యం కాకపోవచ్చు. కానీ, ప్రస్తుతం అందుకు అవకాశాలు ఉన్నాయి. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్టులో భారత్​కు ప్రతికూల ఫలితం వస్తే ఇండియా మొత్తం నాయకత్వ మార్పును కోరుతుంది. రహానేకు ఆ బాధ్యతలు అప్పగించమని అడగవచ్చు.

-నాసర్​ హుస్సేన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​.

"మొదటి టెస్టు భారత్​ గెలిస్తే అంతా సాధారణంగా ఉంటుంది. సిరీస్​లో ఆతిథ్య జట్టు 1-0 తేడాతో నిలుస్తుంది. మళ్లీ కోహ్లీని క్రికెట్​ కింగ్​గా కీర్తిస్తారు. ఒకవేళ ఇంగ్లాండ్​ గెలిస్తే మాత్రం సిరీస్​ ఆసాంతం ఆసక్తికరంగా ఉంటుంది" అని నాసర్​ అభిప్రాయపడ్డాడు.

కాగా, స్వదేశంలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. అతడి నాయకత్వంలో 26 టెస్టులు ఆడిన ఇండియా.. 20 మ్యాచ్​ల్లో నెగ్గింది. ఒక్క టెస్టు సిరీస్​ను కోల్పోలేదు.

ఇదీ చదవండి:హజారే ట్రోఫీ తమిళనాడు జట్టులో నట్టూ

Last Updated : Feb 4, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details