లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన హిట్ జోడీ విరుష్క ఎంతో ఆనందంగా విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న క్రికెటర్ శ్రేయస్.. నీర్ దోసెలు తెచ్చి తనను సంతోషపెట్టాడని విరాట్ ఇన్స్టోలో పోస్ట్ చేశాడు. దీంతోపాటు 'మేం పంపించిన పుట్టగొడుగుల బిర్యానీ కూడా నచ్చిందనే అనుకుంటున్నా శ్రేయాస్' అని రాసుకొచ్చాడు.
ఇదంతా చూసిన యువ బౌలర్ చాహల్ ఎలా ఊరుకుంటాడు. అసలే దూకుడెక్కువ. సహచర ఆటగాళ్లను కవ్వించడంలో ఎప్పుడూ ముందుంటాడు. తక్షణమే విరాట్‌ను కవ్వించాడు.