టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌లు ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ బ్యాట్స్మెన్లని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఏ ఫార్మాట్లలో అయినా పరుగులు రాబట్టడంలో వీరిద్దరూ సిద్ధహస్తులని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఏడాది డిసెంబరులో భారత్‌తో జరగనున్న బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు.
"కోహ్లీ, స్మిత్‌లను పోలిస్తే ఇద్దరూ ఉత్తమ బ్యాట్స్మెన్లే. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేయగల సత్తా వారిలో ఉంది. వీరిద్దరూ ప్రపంచంలో కెల్లా గొప్ప బ్యాట్స్మెన్లు. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది బౌలర్లకు, బ్యాట్స్మెన్లకు మధ్య జరగబోయే యుద్ధం. భారత బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం పటిష్టంగా ఉంది. వారిని టార్గెట్ చేసేందుకు మా బౌలర్లూ సిద్ధంగా ఉన్నారు".