క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోన్న అంశాల్లో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఒకటి. ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ఈ ఆటగాడు త్వరలోనే వీడ్కోలు పలుకుతాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ధోనీ ఇప్పటివరకు మాట్లాడలేదు. తాజాగా ఈ అంశంపై మాజీ ఆటగాడు గంగూలీ స్పందిస్తూ.. మహీ రిటైర్మెంట్పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలిపాడు.
"ధోనీ విషయమై సెలక్టర్లు, విరాట్ కోహ్లీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈ అంశంలో వారే ముఖ్యమైన వారు. వారిని ఒక నిర్ణయానికి రానివ్వండి."
-గంగూలీ, టీమిండియా మాజీ ఆటగాడు