ఐసీసీ నియమావళిని ఉల్లంఘించిన కారణంగా టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. సోమవారం జరిగిన రెండో టెస్టులో అంపైర్ నితిన్ మీనన్‌తో కోహ్లీ గొడవ పెట్టుకోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
రెండో టెస్టు మూడో రోజు చివరి సెషన్లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఎల్బీడబ్ల్యూగా భారత జట్టు అప్పీల్ చేసింది. బంతి రూట్ ప్యాడ్‌కు వెనుక భాగంలో తగిలిన తర్వాత కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ పట్టాడు. అయితే దీనిపై అంపైర్ నితిన్ మేనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమ్ఇండియా రివ్యూకు వెళ్లింది. అయితే అందులో బంతి బ్యాట్‌కు తగిలిన ఆనవాలు కనిపించలేదు. సమీక్షలో ఆఫ్ స్టంప్స్‌కు బంతి తాకినట్లు చూపించింది. కానీ, అంపైర్స్ కాల్ మూలంగా ఆ నిర్ణయం ఇంగ్లాండ్‌కు అనూకూలంగా మారింది. దీంతో అంపైర్‌పై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యి.. నితిన్ మేనన్‌తో గొడవకు దిగాడు.