తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాలీవుడ్​ హీరోలుగా కోహ్లీ ​- కేన్​

డీసీ కామిక్స్​ చిత్రం 'జస్టిన్ లీగ్ జాక్ స్నైడర్ కట్' గురువారం విడుదలైంది. దీనిపై వినూత్న శైలిలో స్పందించింది ఐసీసీ. సూపర్​హీరోల్లా టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిల్యాండ్​ సారథి కేన్ విలియమ్సన్ సహా ప్రముఖ క్రికెటర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసింది. అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Virat Kohli as Aquaman And Ben Stokes as Batman: ICC Releases Cricket Version of Snyder Cut
ఆక్వామన్​గా విరాట్... సుపర్ మ్యాన్​గా కేన్

By

Published : Mar 18, 2021, 5:24 PM IST

డీసీ కామిక్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'జస్టిస్ లీగ్' జాక్ స్నైడర్ కట్.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వినూత్నంగా స్పందించింది. సూపర్ హీరోలా ముఖాలను క్రికెటర్లతో మార్ఫింగ్ చేసి 'యునైట్​ ది లీగ్​' అని క్యాప్షన్ జోడించింది.

ఇందులో.. ఆక్వామ్యాన్​గా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ ఉండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ను సూపర్​మ్యాన్​గా చూపించింది ఐసీసీ. ఇక బ్యాట్​మ్యాన్​గా ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్, సైబార్గ్​గా వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ పొలార్డ్ ఉన్నారు. వండర్ ఉమెన్​గా అస్ట్రేలియా మహిళా జట్టు క్రికెటర్ అల్లైస్ పెర్రి ఉంది.

'జస్టిస్ లీగ్' సినిమా 2017లోనే విడుదలైంది. దిగ్గజ దర్శకుడు జాక్ స్నైడర్.. సినిమాలోని చాలా భాగం చిత్రీకరించారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. మరో దర్శకుడు ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. 'జాక్​ స్నైడర్​ కట్'​ కావాలంటూ అప్పటి నుంచి డీసీ అభిమానులు డిమాండ్​ చేస్తూ వచ్చారు.

ఇదీ చూడండి:ప్రధాని మోదీకి విండీస్ ఆల్​రౌండర్ రసెల్ కృతజ్ఞతలు

ABOUT THE AUTHOR

...view details