తెలంగాణ

telangana

డెత్ ఓవర్లలో బౌలింగ్ సులభం: దీపక్

By

Published : Sep 19, 2019, 9:23 AM IST

Updated : Oct 1, 2019, 4:07 AM IST

చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం సులభంగా ఉంటుందని అన్నాడు టీమిండియా బౌలర్​ దీపక్ చాహర్. కోహ్లీ మరో లెవల్ ఆటగాడని ప్రశంసించాడు.

దీపక్

భారత్​-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీపక్ చాహర్. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ ఆటగాడికి డెత్​ ఓవర్లలో బౌలింగ్​ చేయడమంటే తేలికగా ఉంటుందట.

"చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం తేలికగా ఉంటుందని గ్రహించా. పవర్​ప్లేలో బౌండరీ లైన్​ వద్ద ఇద్దరు ఫీల్డర్లే​ ఉంటారు. డెత్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడు బౌలింగ్ చేయడం సులభమవుతుంది."
-దీపక్ చాహర్, టీమిండియా బౌలర్

ఐపీఎల్ వల్ల మెరుగైన ప్రదర్శన చేస్తున్నానని తెలిపాడు చాహర్. టీ20 ప్రపంచకప్​ గురించి ప్రశ్నించగా.. అందుకు ఇంకా ఏడాది ఉందని అన్నాడు. విరాట్ గొప్ప ప్లేయర్​ అని కొనియాడాడు.

"టీ20 ప్రపంచకప్​కు ఇంకా ఏడాది ఉంది. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించట్లేదు. ప్రతి మ్యాచ్​ను చివరిదాని లాగే ఆడతా. ప్రస్తుతం తుదిజట్టులో చోటు దక్కించుకోవడమే ముఖ్యం. విరాట్ భయ్యా మరో లెవల్ ఆటగాడు. ఇంత స్థిరంగా పరుగులు ఎలా సాధిస్తున్నాడో అర్థం కావడం లేదు.
-దీపక్ చాహర్, టీమిండియా బౌలర్

ఈ మ్యాచ్​లో గెలిచిన కోహ్లీసేన సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 22న మూడో టీ20 జరగనుంది.

ఇవీ చూడండి.. రోహిత్​ టీ20 రికార్డు బ్రేక్​... టాపర్​గా కోహ్లీ

Last Updated : Oct 1, 2019, 4:07 AM IST

ABOUT THE AUTHOR

...view details