తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెస్టిండీస్​పై ఇంగ్లండ్ "మార్క్" - వెస్టిండీస్

ఇంగ్లండ్​ పేస్​ బౌలర్​ మార్క్ వుడ్ టెస్టుల్లో తొలిసారిగా 5 వికెట్ల ఘనత సాధించాడు.

వెస్టిండీస్​పై ఇంగ్లండ్ "మార్క్"

By

Published : Feb 11, 2019, 7:47 PM IST

ప్రస్తుతం వెస్టిండీస్​లో పర్యటిస్తోంది ఇంగ్లండ్ జట్టు. ఇప్పటికే టెస్టు సిరీస్​లో 2-0 తో వెనకబడి ఉంది. మూడో టెస్టు సెయింట్ లూసియాలో జరుగుతోంది. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్.. తొలిసారిగా తన కెరీర్​లో 5 వికెట్ల ఘనత సాధించాడు.

కేవలం 8.2 ఓవర్లలో 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి మొదటి ఇన్నింగ్స్​లో విండీస్​ను 154 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మొదటి ఇన్నింగ్స్​లో 277 పరుగులు చేసిన ఇంగ్లండ్​ జట్టు, రెండో ఇన్నింగ్స్​లో రెండో రోజు ముగిసే సరికి 19/0 వద్ద నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని 142 పరుగుల ఆధిక్యం సాధించింది.

"ఈరోజను నేనేప్పటికి మరిచిపోలేను. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ మ్యాచ్​లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను" -మార్క్ వుడ్.

వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య టెస్టులతో పాటు ఐదు వన్డేలు, మూడు టీట్వంటీలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details