తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సచిన్​ షోల్డర్​ ఔట్​ వల్ల కోట్ల మందికి తెలిశా' - 1999 adilide test

భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ను గతంలో ఎల్బీగా ఔటివ్వడంపై మాట్లాడారు ఆస్ట్రేలియా అంపైర్​ హార్పర్​. 1999 అడిలైడ్​ టెస్టును గుర్తు చేసుకున్న ఆయన.. మాస్టర్​ను​ ఔట్​గా ప్రకటించడం వల్ల​ కోట్ల మందికి నా పేరు తెలిసిందని చెప్పారు. సచిన్​ క్రీడా స్ఫూర్తిపైనా ప్రశంసలు కురిపించారు.

sachin news
సచిన్​ను ఔట్​గా ప్రకటించడం వల్ల కోట్ల మందికి తెలిశా?

By

Published : Jul 22, 2020, 9:21 AM IST

షోల్డర్‌ బిఫోర్‌ వికెట్‌ గుర్తుందా..? 1999 అడిలైడ్‌ టెస్టులో ఆస్ట్రేలియా పేసర్‌ మెక్‌గ్రాత్‌ బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో సచిన్‌ కిందకు వంగగా.. బంతి అతడి భుజాలకు తాకింది. బౌలర్‌ అప్పీల్‌ చేయగానే అంపైర్‌ హార్పర్‌ ఔటివ్వడం వివాదాస్పదమైంది.

దీనిపై ఇప్పుడు హార్పర్‌ మాట్లాడుతూ.. "సచిన్‌ను ఔట్‌ ప్రకటించిన నిర్ణయాన్ని నేనెప్పుడూ గుర్తుచేసుకుంటా. అయితే చెడుగా కాదు. అదేమీ నాకు పీడకల కాదు. నా కెరీర్‌ను గుర్తుచేసుకుంటే నేను గర్వించే నిర్ణయంగా అది నిలుస్తుంది. ఎలాంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా తీసుకున్న సరైన నిర్ణయం అది. ఆ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను 2018లో అదే మైదానంలో కలిశాను. అప్పుడు అతడు సచిన్‌ ఔట్‌ను గుర్తుచేసుకున్నాడు. తాను ఔటయ్యానని సచిన్‌ చెప్పాడని ప్రసాద్‌ తెలిపాడు. అలాంటి ఔట్‌ను నా కెరీర్లో మళ్లీ చూడలేదు. ఆ మ్యాచ్‌ తర్వాత టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు చాలాసార్లు అంపైర్‌గా వ్యవహరించినా సచిన్‌ ఎప్పుడూ దాని గురించి చర్చించలేదు. నిజమైన క్రీడా స్ఫూర్తి అదే" అని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details