ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ గెలిచి, తొలిసారి కప్పును ముద్దాడింది. ఆ సమయంలో కొందరు బంగ్లా ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత్ ఆటగాళ్లపై వెకిలి చేష్టలు చేస్తూ కవ్వించారు. ఈ కారణంగా ఇరుజట్లు క్రికెటర్లు మైదానంలోనే గొడవకు దిగారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. మొత్తంగా ఐదుగురిపై చర్యలు తీసుకుంది. అందులో ముగ్గురు బంగ్లా ఆటగాళ్లు(తోహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, రకిబుల్ హసన్ )కాగా, ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు(ఆకాశ్ సింగ్, రవి బిష్ణోయ్).
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.21ను నలుగురు ఉల్లంఘించగా, భారత్ బౌలర్ రవి బిష్ణోయ్ 2.5 నిబంధనను మీరినట్లు తేలింది.