తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్​ దూకుడు అడ్డుకున్న పైన్​.. నెటిజన్ల ఫైర్​

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ ట్రిపుల్​ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్​లో 418 బంతుల్లో 335* పరుగులతో అజేయంగా నిలిచాడీ స్టార్​ బ్యాట్స్​మన్​. అయితే ఇతడి ఆటతీరు చూస్తే బ్రియాన్​ లారా(400) రికార్డు బ్రేక్​ అవుతుందని అభిమానులు ఆశించగా.. దానికి చెక్​ పెట్టాడు ఆసీస్​ కెప్టెన్​ టిమ్​ పైన్​.

tim-paine-shocking-decision-to-declared-innings-ahead-warner-going-to-beat-lara-400-runs
వార్నర్​ దూకుడు అడ్డుకున్న టిమ్​ పైన్​... నైటిజన్లు ఫైర్​

By

Published : Nov 30, 2019, 3:04 PM IST

Updated : Nov 30, 2019, 4:54 PM IST

బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం తర్వాత యాషెస్​ సిరీస్​లో రీఎంట్రీ ఇచ్చిన వార్నర్​.. ఆ మ్యాచ్​ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత పాకిస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​ల్లో మళ్లీ పుంజుకున్నాడు. పాక్​తో జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో త్రిశతకం చేశాడు. కెరీర్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(335*) నమోదు చేశాడు.

ట్రిపుల్​ సెంచరీ చేసిన వార్నర్​

దూకుడైన బ్యాటింగ్​తో అలవోకగా 300 పరుగుల మార్కు దాటిన వార్నర్​.. కచ్చితంగా 400 పరుగులు చేసి విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారా రికార్డు బ్రేక్ చేస్తాడని అంతా భావించారు. కానీ ఆ అంచనాలకు చెక్​ పెడుతూ అనూహ్యంగా 589 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్​ ఇచ్చాడు ఆసీస్​ సారథి టిమ్​ పైన్​.

ఈ నిర్ణయంతో ఆశ్చర్యపడిన క్రికెట్​ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్​లో ఓ అద్భుతమైన మైలురాయిని అందుకునే దిశగా వెళ్తుంటే.. పైన్​ దాన్ని చెడగొట్టాడని నెటిజన్లు మీమ్స్​తో ట్రోల్ చేస్తున్నారు.

ఆట రెండో రోజే అయినా.. అంత తొందరగా ఎందుకు డిక్లేర్​ తీసుకోవడం అని పైన్​పై అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్​ బౌలర్లు ఏమి చేయలేకపోతున్నారని.. అందువల్ల ఆసీస్​ సారథి సహాయం చేశాడని వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.

రికార్డులివే...

  1. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు.
  2. పాకిస్థాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్‌.
  3. ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. డే/నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు. గతంలో పాకిస్థాన్​ కెప్టెన్​అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.
  4. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డునూ వార్నర్‌ ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్​తోనే మళ్లీ...

బాల్​ ట్యాంపరింగ్​ వివాదంతో ఏడాది ఆటకు దూరమైన వార్నర్​.. ఐపీఎల్​తోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో దాదాపు 600లకు పైగా పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​సెమీస్​ వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

Last Updated : Nov 30, 2019, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details