ఈ ఏడాది ఐపీఎల్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. అందుకే మెగాటోర్నీ కోసం జట్లన్నీ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆతిథ్య దేశానికి చేరుకుంటున్నాయి. ఆగస్టు 20న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈలో కాలుమోపాయి. సెప్టెంబర్ 19 నుంచి లీగ్ ప్రారంభం కానుంది.
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ప్రత్యేక విమానాల్లో దుబాయ్ చేరుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబిలో దిగింది. ఆయా ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేశాయి. క్రికెటర్లకు మాస్కులు, శానిటైజర్లనే కాకుండా పీపీఈ కిట్లు కూడా అందించారు.
పర్యటనకు ముందే ఆటగాళ్లందరికీ కొవిడ్-19 టెస్టులు చేశారు. అంతేకాదు యూఏఈలో మరో ఆరు రోజులు అందరూ ఐసోలేషనలో ఉండనున్నారు. ఈ సమయంలో మూడుసార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. వీటన్నింటిలో నెగిటివ్ వచ్చిన వాళ్లే బయోబబుల్‌లో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత శిక్షణలో పాల్గొంటారు.