తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మార్పుల వల్లే టీమ్ఇండియా ఓటమి: వాన్ - మైఖేల్ వాన్ వార్తలు

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా ఓటమికి కారణం బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులేనని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. రెండో టీ20లో రాణించిన ఇద్దరు ఆటగాళ్లు మూడో మ్యాచ్​లో వేరే స్థానంలో రావడం సరైంది కాదని వెల్లడించాడు.

Michael Vaughan
వాన్

By

Published : Mar 18, 2021, 9:47 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఓటమికి కారణం బ్యాటింగ్ ఆర్డర్​లో మార్పులేనని తెలిపాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. గత మ్యాచ్​లో సత్తాచాటిన వారి స్థానాలను మార్చడం భారత జట్టు ఓటమికి కారణమైందని వెల్లడించాడు.

"టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ జట్టును తలపించింది భారత టీమ్. ఇంగ్లాండ్ కూడా టెస్టు సిరీస్​లో అనవసరమైన మార్పులతో ఓటమిపాలైంది. అలాగే టీ20 సిరీస్​లో భారత జట్టు కూడా అలాగే ఉంది. గత మ్యాచ్​లో సత్తాచాటిన ఇద్దరి బ్యాటింగ్ స్థానాలను ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు. రెండో టీ20లో ఓపెనర్​గా వచ్చి రాణించిన ఇషాన్​ కిషన్​ను మూడో స్థానంలో పంపారు. అలాగే మూడో స్థానంలో వచ్చి అర్ధశతకం చేసిన కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చాడు. గత మ్యాచ్​లో ఫలితాన్ని దృష్టిలో ఉంచుకోవాలి కదా. రాహుల్​ని మిడిలార్డర్​లో ఆడిస్తే సరిపోయేది."

తొలి రెండు టీ20లకు విశ్రాంతినిచ్చిన ఓపెనర్ రోహిత్ శర్మ మూడో మ్యాచ్​లో బరిలో దిగాడు. దీంతో రాహుల్, రోహిత్​లను ఓపెనర్లుగా పంపిన యాజమాన్యం ఇషాన్​ను మూడో స్థానంలో, కోహ్లీని నాలుగో స్థానంలో దింపింది. దీంతో ఫలితం టీమ్ఇండియాకు వ్యతిరేకంగా వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details