తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ ముందు భారీ లక్ష్యం.. - KHAWAZA

మూడో వన్డే మొదటి ఇన్నింగ్స్​లో 313 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా.  ఖవాజా (104), ఫించ్ (93) పరుగులతో అలరించారు.

అదరగొట్టిన ఫించ్-ఖవాజా జంట

By

Published : Mar 8, 2019, 5:38 PM IST

Updated : Mar 9, 2019, 1:29 PM IST

రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ముందు 314 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది భారత్​. విజయం సాధించి రేసులోకి రావాలని కంగారూ జట్టు భావిస్తోంది.రాంచీలో ఆసిస్ చేసిన 314 పరుగులే అత్యధిక స్కోరు.

ఆసిస్ ఓపెనింగ్ అదిరెన్..

టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు ఫించ్, ఖవాజా చెలరేగి ఆడి మొదటి వికెట్​కు 193 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు.ఆసిస్​కుభారత గడ్డపైమొదటి వికెట్​కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఫామ్​ను అందుకోలేక తంటాలుపడుతున్న కెప్టెన్ ఫించ్ 93 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో బ్యాట్స్​మెన్ ఖవాజా 104 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

సెంచరీతో ఆకట్టుకున్న ఖవాజా

మాక్స్​వెల్ ఉండుంటే..

అనంతరం మాక్స్​వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా చేసిన అద్భుత రనౌట్​కు పెవిలియన్ బాట పట్టాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆస్ట్రేలియా చివరి పది ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మిగతా బ్యాట్స్​మెన్​లో షాన్ మార్ష్ 7, స్టాయినిస్ 31, క్యారీ 21 పరుగులే చేయగలిగారు. హాండ్స్​కాంబ్ డకౌట్​గా వెనుదిరిగాడు.

కుల్​దీప్ మాయ..

ఆసిస్ ఓపెనర్లు చెలరేగగా 30 ఓవర్ల వరకు వికెట్లు తీయలేకపోయారు భారత్ బౌలర్లు. ఫించ్​ను ఎల్బీడబ్ల్యుగా ఔట్ చేసిన కుల్​దీప్.. ప్రత్యర్ధి తక్కువ పరుగులు చేయడానికి తొలి అడుగు వేశాడు. షాన్ మార్ష్​, హాండ్స్​కాంబ్​ను ఒకే ఓవరులో పెవిలియన్​కు పంపాడు.

మిగతా బౌలర్లలో షమికి మాత్రమే ఒక వికెట్ దక్కింది. 104 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్దు ఖవాజాను అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. వికెట్లేమీ తీయకున్నా మిగతా బౌలర్లు పరిధి మేర రాణించారు.

పుల్వామా దాడికి నివాళిగా భారత జట్టు సభ్యులందరూ ఆర్మీ క్యాప్​లతో మైదానంలో కనిపించారు.

Last Updated : Mar 9, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details