తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ రికార్డు బ్రేక్​ చేసిన థాయ్​లాండ్ అమ్మాయిలు

అంతర్జాతీయ టీ20ల్లో థాయ్​లాండ్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా 17 మ్యాచ్​లు నెగ్గి ఆసీస్​ పేరిట ఉన్న 16 విజయాల రికార్డును బ్రేక్​ చేసింది. ఒక్క ఈ ఏడాదిలోనే 15 ఆటలు గెలిచింది.

థాయ్​లాండ్

By

Published : Aug 11, 2019, 3:50 PM IST

Updated : Sep 26, 2019, 4:00 PM IST

థాయ్​లాండ్... ఈ దేశం క్రికెట్ ఆడుతుందని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా.. అంతర్జాతీయ మ్యాచ్​ల్లో రికార్డు విజయాలు సొంతం చేసుకొంటుందని ఊహించి ఉండరు. ఒకటి కాదు.. రెండు కాదు వరుసగా 17 అంతర్జాతీయ టీ-20ల్లో విజయం సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా(16) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది థాయ్​లాండ్ మహిళా క్రికెట్ జట్టు.

శనివారం నెదర్లాండ్స్​తో జరిగిన టీ-20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు థాయ్​లాండ్ అమ్మాయిలు. నాలుగు దేశాలు కలిసి ఆడుతున్న ఈ సిరీస్​లో... ఆడిన మూడు మ్యాచ్​ల్లో మూడింట నెగ్గింది. థాయ్​లాండ్​తో పాటు నెదర్లాండ్స్​, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్​ 54 పరుగులకు ఆలౌటైంది. అనంతరం థాయ్​లాండ్​ కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నట్టాకమ్ చాంతమ్ 42 పరుగులు చేసి ఆకట్టుకుంది. థాయ్​లాండ్​ బౌలర్లలో నటాలియా 3 వికెట్లు తీసింది.

గత ఏడాదే అరంగేట్రం..

థాయ్​లాండ్ మహిళా జట్టు తన తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్​ను... 2018 జూన్​లో పాకిస్థాన్​తో ఆడింది. ఇప్పటివరకు 25 మ్యాచ్​లు ఆడి 19 విజయాలు సొంతం చేసుకుంది. అంతేకాకుండా వాటిలో 17 మ్యాచ్​లు వరుసగా నెగ్గడం రికార్డు. ఈ ఏడాదిలోనే వరుసగా 15 విజయాలు సొంతం చేసుకొంది.

శ్రీలంకనే ఓడించింది...

మహిళల టీ-20 ఆసియాకప్​లో శ్రీలంకను ఓడించింది థాయ్​లాండ్. 2018లో జరిగిన ఈ టోర్నీలో ఐసీసీ శాశ్వత సభ్యదేశంపై గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.

ఆగ్నేయాసియా క్రీడల్లో స్వర్ణం..

ఆగ్నేయాసియా క్రీడల్లో స్వర్ణాన్ని సాధించింది థాయ్​ మహిళా క్రికెట్​ జట్టు. నాలుగు మ్యాచ్​లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది.
పొట్టి ఫార్మాట్​లో వరుసగా ఎక్కువ విజయాలు అందుకున్న దేశాల్లో థాయ్​లాండ్(17) తర్వాత ఆస్ట్రేలియా(16), జింబాబ్వే(14), ఇంగ్లాండ్(14), న్యూజిలాండ్(12) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇది చదవండి:బాటిల్​ క్యాప్ ఛాలెంజ్​ను.. బ్యాట్​తో ఛేదించాడు

Last Updated : Sep 26, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details