విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. ఇందులో గెలిచిన టీమిండియా 40 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ఛాంపియన్‌షిప్‌లో... ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లను కేటాయిస్తారు. ఇందులో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.
దూసుకెళ్తోన్న కోహ్లీసేన...
ఛాంపియన్‌షిప్ ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభమవగా.. ఇటీవల వెస్టిండీస్‌తో జిరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో గెలుపొందింది భారత జట్టు. అప్పుడు 120 పాయింట్లతో జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది టీమిండియా. తాజాగా సఫారీలపై గెలిచిన కోహ్లీసేన మరో 40 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 160 పాయింట్లలో నెం.1 స్థానంలోనే కొనసాగుతోంది భారత జట్టు. తర్వాత న్యూజిలాండ్ (60 పాయింట్లు), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.