తెలంగాణ

telangana

ETV Bharat / sports

4000 మందికి అండగా దిగ్గజ సచిన్ తెందుల్కర్ - సచిన్​ దాతృత్వం.

4000 మంది పేద ప్రజలకు అండగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్.. ముంబయిలోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేశాడు.

Tendulkar
సచిన్

By

Published : May 9, 2020, 1:02 PM IST

దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్​ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. కరోనాపై పోరులో భాగంగా 4000 మంది పేదప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ముంబయిలోని హై5 అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సాయం చేశాడు. అయితే ఎంత మొత్తం ఇచ్చాడనేది మాత్రం ఆ ఫౌండేషన్ ప్రకటించలేదు.

4000 మందికి సాయం చేసినందుకు సచిన్​కు కృతజ్ఞతలు చెబుతూ హై5 ఫౌండేషన్​ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన సచిన్.. "రోజువారీ కూలీల కుటుంబపోషణకు అండగా నిలుస్తున్న హై5 సంస్థ సభ్యులకు నా ధన్యావాదాలు" అంటూ రాసుకొచ్చాడు.

ఇటీవల సచిన్ తెందుల్కర్.. కరోనా కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి సహాయ నిధికి, మహారాష్ట్ర ప్రభుత్వ సహాయనిధికి చెరో రూ. 25లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

ఇదీ చూడండి : ఒకేరోజు టెస్టు, వన్డే ఆడనున్న టీమిండియా!

ABOUT THE AUTHOR

...view details