భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 100మంది చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచాడు. ఎకాం ఫౌండేషన్ ద్వారా వారి చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును సచిన్ భరించనున్నాడు. ఈ చిన్నారి బాధితులు మహారాష్ట్ర, బంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
100మంది చిన్నారులకు సచిన్ వైద్యసాయం - సచిన్ తెందుల్కర్
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 100మంది చిన్నారులకు వైద్యసాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఆ బాధితుల చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును సచిన్ భరించనున్నాడు.
సచిన్
ఇటీవల అసోంలోని ముకుంద ఆస్పత్రికి వైద్యపరికరాలను విరాళంగా ఇచ్చాడు సచిన్. దీని ద్వారా 2వేల మంది చిన్నారులకు ప్రయోజనం కలుగనుంది.
ఇదీ చూడండి : 4000 మందికి అండగా దిగ్గజ సచిన్ తెందుల్కర్