తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో వన్డే కోసం విశాఖ చేరుకున్న భారత్-విండీస్ - team india westindies reach vizag foe second odi

భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే.. ఈనెల 18న జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు విశాఖపట్నం​ చేరుకున్నాయి.

team india
విశాఖ చేరుకున్న ఇరుజట్లు

By

Published : Dec 16, 2019, 4:56 PM IST

విశాఖ చేరుకున్న ఇరుజట్లు

ఈ నెల 18న జరగనున్న రెండో వన్డేలో తలపడేందుకు భారత్‌, వెస్టిండీస్‌ జట్లు సోమవారం.. విశాఖపట్నం చేరుకున్నాయి. విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్లు.. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో నోవాటెల్‌ హోటల్​కు వెళ్లారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మ, రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, షమితో పాటు విండీస్‌ క్రికెటర్లు పొలార్డ్‌, హెట్మయిర్‌, హోప్‌, ఆంబ్రిస్‌, పూరన్‌ తదితరులు విశాఖ వచ్చారు. ఇరు జట్లు మంగళవారం.. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ప్రాక్టీస్‌ చేయనున్నాయి.

ఇవీ చూడండి.. అగ్రస్థానంలో కోహ్లీ.. ఆరో స్థానానికి బుమ్రా

ABOUT THE AUTHOR

...view details