ఐసీసీ టీ20 ప్రపంచకప్ కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడనున్న క్రమంలో.. ఆ సమయం ఐపీఎల్ నిర్వహణకు అనువైనదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఒకవేళ ఐపీఎల్ నిర్వహిస్తే భారత్ వరకు ఎలా ప్రయాణిస్తారనేది వ్యక్తిగత వ్యవహారమని.. దానికి వారి దేశ క్రికెట్ బోర్డ్‌ల సహకారం అవసరం లేదని స్పష్టం చేశాడు.
"అక్టోబరులో నిర్వహించే టీ20 ప్రపంచకప్ కోసం 15 జట్లు ఆస్ట్రేలియాకు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సంక్షోభంలో ఏడు వేదికలపై 45 మ్యాచ్‌లను నిర్వహించడం కష్టతరమైనదని భావిస్తున్నా. టోర్నీకి ముందు 14 రోజుల నిర్బంధమనేది మరీ కఠినమైనది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచకప్‌ను వాయిదా వేయాలని ఐసీసీ నిర్ణయిస్తే.. ఆ షెడ్యూల్ ఐపీఎల్ నిర్వహణకు ఉపయోగపడుతుంది".