తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ వార్త వినగానే వారం రోజులు నిద్ర పట్టలేదు'

ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​ నుంచి మధ్యలోనే వైదొలగడంపై ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ స్పష్టతనిచ్చాడు. తన తండ్రికి బ్రెయిన్​ కేన్సర్​ రావడమే కారణమని వెల్లడించాడు.

Stokes
బెన్​ స్టోక్స్​

By

Published : Aug 30, 2020, 7:24 AM IST

తన తండ్రికి బ్రెయిన్‌ కేన్సర్ అని తెలిసి వారం రోజులు నిద్రపట్టలేదని ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ సందర్భంగా అతడు తొలి మ్యాచ్​లో మాత్రమే పాల్గొన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడి తండ్రి గెరాడ్‌ స్టోక్స్‌ అనారోగ్యం బారిన పడటం వల్ల.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండానే కివీస్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న ఈ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఓ స్థానిక మీడియాతో మాట్లాడాడు.

బెన్​ స్టోక్స్​ కుటుంబం

"చిన్నప్పటి నుంచి మా నాన్న నా పట్ల కఠినంగా ఉండేవారు. అయితే, నేను పెరిగే కొద్ది ఆయన అలా ఎందుకు ఉండేవాడో అర్థమయ్యేది. అందుకు ఒక కారణం ఉంది. నేనొక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా అవ్వాలనుకుంటున్నాననే విషయం తెలిసి నన్ను అలా క్షమశిక్షణతో పెంచారు. తను ఎలాంటి వ్యక్తి అనే విషయం అతనికున్న పేరు ప్రఖ్యాతలే చెబుతాయి. మా నాన్న గురించి తెలిసిన ఎవర్ని అయినా అడగండి. తనతో పనిచేసిన వాళ్లని లేదా ఆయన దగ్గర శిక్షణ పొందిన వారిని.. ఎలా ఉంటారని అడగండి. అందరూ ఒకటే మాట చెబుతారు" అని స్టోక్స్‌ వివరించాడు.

తండ్రితో బెన్​స్టోక్స్​

పాక్‌తో ఆడిన తొలి టెస్టులో విఫలమైన స్టోక్స్‌.. అంతకుముందు వెస్టిండీస్​తో జరిగిన‌ టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్​లోనూ స్టోక్స్‌ అదిరిపోయే ప్రదర్శన చేశాడు.

ABOUT THE AUTHOR

...view details