తెలంగాణ

telangana

కోహ్లీ, స్టోక్స్​కు ఆ విషయంలో పోలికలు!

By

Published : Jul 5, 2020, 4:32 PM IST

స్టార్ క్రికెటర్ స్టోక్స్ మంచి కెప్టెన్ అవుతాడని చెప్పిన మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్.. ఈ విషయంలో కోహ్లీతో అతడికి పోలికలు ఉన్నాయని తెలిపాడు. త్వరలో వెస్టిండీస్​తో జరిగే తొలి టెస్టుకు ఇంగ్లాండ్​ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు స్టోక్స్.

స్టోక్స్​, కోహ్లీకి ఆ విషయంలో పోలికలు!
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ

ఇంగ్లాండ్​ స్టార్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్, టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీకి కెప్టెన్సీ విషయంలో పోలికలున్నాయని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. భవిష్యత్తులో స్టోక్స్ అద్భుతమైన సారథి అవుతాడని జోస్యం చెప్పాడు.

"సాధారణంగా స్టోక్స్​కు కోహ్లీతో పోలికలున్నాయి. ఏ పనినైనా వీరిద్దరూ 100 శాతం నిబద్ధతతో చేస్తారు. అందువల్ల భవిష్యత్తులో అద్భుతమైన కెప్టెన్​ అవుతాడని అనుకుంటున్నాను. అయితే అతడు పూర్తిస్థాయి సారథిగా ఉండటం మంచిది కాదు. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండటం వల్ల స్టోక్స్​పై పని ఒత్తిడి పెరిగే ప్రమాదముంది" -నాసిర్ హుస్సేన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

రూట్​ గైర్హాజరీతో త్వరలో వెస్టిండీస్​తో మొదలయ్యే తొలి టెస్టుకు స్టోక్స్ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్​ను ఇంగ్లాండ్​లోని బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్

జులై 8 నుంచి ఇంగ్లాండ్​లో ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్​కు జట్లను ప్రకటించారు. అయితే కరోనా లాక్​డౌన్ తర్వాత జరుగుతున్న తొలి సిరీస్​ ఇదే కావడం వల్ల క్రికెట్ అభిమానులు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details