తెలంగాణ

telangana

ETV Bharat / sports

దివ్యాంగ క్రికెటర్లకు అండగా స్టీవ్​ వా మేనేజర్​

కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న భారత దివ్యాంగ క్రికెటర్లకు అండగా నిలిచారు ఆసీస్ మాజీ సారథి స్టీవ్​ వా మేనేజర్​ హర్లీ మెడ్​కాఫ్. పీసీసీఏఐ సంస్థకు లక్ష 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

By

Published : Jun 17, 2020, 2:54 PM IST

Steve waugh
స్టీవ్​ వా

దిగ్గజ క్రికెటర్ స్టీవ్​ వా మేనేజర్​ హర్లీ మెడ్​కాఫ్.. భారత దివ్యాంగుల క్రికెట్​ సంస్థ (పీసీసీఏఐ)కు రూ.లక్ష 50 వేలు విరాళమిచ్చి మంచి మనసు చాటుకున్నారు​. ఇందులో భాగంగా 30 మంది దివ్యాంగ ఆటగాళ్లకు రూ.5 వేలు చొప్పున, వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

కరోనా ప్రభావంతో క్రికెట్ మ్యాచ్​లు​ నిలిచిపోవడం వల్ల పీసీసీఏఐలోని క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేశారు హర్లీ. స్టీవ్​ వాతో కలిసి ఓసారి భారత్​ పర్యటనకు వచ్చినప్పుడు, ఈ సంస్థతో తనకు అనుబంధం ఏర్పడిందని అన్నారు హర్లీ. అయితే విరాళం ఇచ్చినందుకు ఆయనకు పీసీసీఏఐ కృతజ్ఞతలు తెలిపింది.

ఇది చూడండి : మీ త్యాగం అమరం.. వీరజవాన్లకు క్రీడాకారుల నివాళి

ABOUT THE AUTHOR

...view details