జోరుమీదున్న ఇంగ్లాండ్.. వరుస ఓటములు ఎదుర్కొంటున్న శ్రీలంకతో నేడు ప్రపంచకప్ మ్యాచ్ ఆడనుంది. హెడ్డింగ్లీ మైదానం వేదిక.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండులో ఇంగ్లండ్, ఆరో స్థానంలో శ్రీలంక ఉన్నాయి. మోర్గాన్ నేతృత్వంలో ఇంగ్లీష్ జట్టు పూర్తి ఫామ్‌లో ఉంది. పసికూన ఆఫ్గాన్‌పై మాత్రమే గెలిచిన లంక.. మరో విజయం కోసం శ్రమిస్తోంది.
ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్.. గత మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ రోజు అలాంటి బ్యాటింగ్ పునరావృతమైతే లంక గతి అంతే. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మొదటి పది మందిలో ఈ జట్టులోని ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దీన్ని బట్టి వీరు ఎలా ఆడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
నిలకడలేమితో ఓటముల్ని చవిచూస్తున్న లంకేయులు.. ఈ మ్యాచ్‌లోనైనా రాణించి రేసులో నిలవాలని భావిస్తున్నారు.