తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అవకాశమిస్తే టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడతా' - శ్రీశాంత్​పై నిషేధం

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​ శ్రీశాంత్​. సెలక్టర్లు తనను జట్టులోకి తిరిగి ఎంపిక చేస్తే తన ప్రతిభను నిరూపించుకుంటానని చెప్పాడు. సెప్టెంబరులో అతడిపై ఉన్న నిషేధం ముగియనున్న నేపథ్యంలో.. తిరిగి కేరళ తరపున రంజీల్లో ఆడనున్నాడు.

Sreesanth nurses the dreams of representing India again
'ఛాన్సిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆడతా'

By

Published : Jun 21, 2020, 6:11 PM IST

స్పాట్​ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్​కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్​నెస్​ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్​.. టీమ్​ఇండియా తరఫున ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఆడాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

"ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానానికి నేను పోటీపడలేను. కేవలం నా అనుభవాన్ని, సహకారాన్ని అందిచడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నా. ఒకవేళ సెలక్టర్లు నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటే.. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత్​ తరఫున ఆడాలనుంది".

- శ్రీశాంత్​, టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​

ఏం జరిగిందంటే?

2013 ఐపీఎల్​లో​ స్పాట్​ ఫిక్సింగ్​ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్​తో పాటు, రాజస్థాన్​ రాయల్స్ జట్టు​లోని అజిత్​ చండిలియా, అంకిత్​ చవాన్​లు అరెస్టు అయ్యారు. అనంతరం కేరళ పేసర్​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం నిషేధం విధించింది. దాన్ని పునఃపరిశీలించాలని శ్రీశాంత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ బౌలర్​పై ఉన్న శిక్షను తగ్గించాలని బీసీసీఐకి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు అతడిపై ఉన్న నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేళ్లకు బోర్డు కుదించింది. ఆ గడువు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.

ఇదీ చూడండి... ఐపీఎల్​లో వార్నర్​తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ

ABOUT THE AUTHOR

...view details