తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అర్జున' అవార్డు రేసులో ఫాస్ట్​ బౌలర్​ బుమ్రా! - అర్జున అవార్డుకు బుమ్రాను ప్రతిపాదించనున్న బీసీసీఐ

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఆటగాళ్లకు భారత ప్రభుత్వం అందించే పురస్కారం 'అర్జున' అవార్డు. దీని కోసం బీసీసీఐ ఈసారి ఫాస్ట్​బౌలర్​ బుమ్రా పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అంతే కాకుండా మహిళల విభాగంలోనూ ఓ క్రీడాకారిణి పేరును సిఫారసు చేస్తారని తెలుస్తోంది.

sppedstar Jasprit Bumrah nominated to arjuna award
'అర్జున' అవార్డుకు బుమ్రాను ప్రతిపాదించనున్న బీసీసీఐ

By

Published : May 14, 2020, 7:55 AM IST

ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం బీసీసీఐ ఈ ఏడాది ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా పేరును ప్రతిపాదించే అవకాశముంది. బోర్డు ఒకటి కంటే ఎక్కువ పేర్లు పంపాలనుకుంటే శిఖర్‌ ధావన్‌ రేసులోకి వస్తాడు. బీసీసీఐ 2018లోనూ ధావన్‌ పేరును ప్రతిపాదించినా.. అతడికి అర్జున దక్కలేదు. మహిళల విభాగం నుంచి కూడా బీసీసీఐ నామినేషన్లను ఖరారు చేయనుంది.

26 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 14 టెస్టుల్లో 68 వికెట్లు పడగొట్టాడు. 64 వన్డేల్లో 104, 50 టీ20ల్లో 59 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మహిళల విభాగంలో దీప్తి శర్మ పేరును అర్జున అవార్డు కోసం సిఫారసు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇదీ చూడండి.. పాకిస్థాన్​ వన్డే జట్టు కొత్త కెప్టెన్​గా బాబర్

ABOUT THE AUTHOR

...view details