తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాక్​డౌన్​ క్రికెటర్లు: ఆన్​లైన్​లో​ఆట.. లైక్​ల వేట - కోహ్లీ అనుష్క క్రికెట్​ వీడియో

లాక్​డౌన్​ కారణంగా సోషల్​మీడియాలో సమయాన్ని గడుపుతున్నారు టీమ్​ఇండియా క్రికెటర్లు. దొరికిన ఖాళీ సమయాన్ని వారికి నచ్చిన వ్యాపకాలతో గడుపుతూ.. మరోవైపు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. వారిలో ఉన్న కళలను ఈ సమయంలో బయటపెడుతున్నారు.

special story on Cricketers doing things during lockdown
ఆన్​లైన్​లో​ ఆడేస్తున్నారు.. లైక్​లు కొట్టేస్తున్నారు

By

Published : May 17, 2020, 8:14 AM IST

ఇప్పుడు క్రికెటర్ల ఆటంతా ఆన్‌లైన్‌లోనే! లాక్‌డౌన్‌ కారణంగా లభించిన విరామాన్ని తమ అభిరుచులను నెరవేర్చుకోవడానికి వాళ్లు ఉపయోగిస్తున్నారు. లేదా భిన్నమైన వీడియోలు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. మరి ఇలా చేస్తున్నవాళ్లలో ముందు వరుసలో ఉన్నదెవరో చూద్దాం..

విరుష్క సందడి

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్కశర్మ లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర వీడియోలు పెడుతున్నారు. తాజాగా తన భార్య నిర్మించిన 'పాతాల్‌ లోక్‌' అనే వెబ్‌ సిరీస్‌ను ఆసాంతం తిలకించినట్లు.. ఈ వెబ్‌ సిరీస్‌కు ఆమె నిర్మాతగా వ్యవహరించడం గర్వంగా ఉందని చెబుతూ కోహ్లీ ట్వీట్‌ చేశాడు. మరోవైపు అనుష్క బ్యాటింగ్‌ చేస్తుండగా విరాట్‌ బౌలింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

యూవీ ఛాలెంజ్​

సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లకు ఇటీవలే ఓ సరికొత్త సవాలు విసిరాడు యువరాజ్​ సింగ్​ . 'KeepItUp​' అనే ఛాలెంజ్​ను ప్రారంభించి దీన్ని కొనసాగించండి అంటూ పలువురిని నామినేట్​ చేశాడు. అందులో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, రోహిత్​ శర్మ, హర్భజన్​ సింగ్​ ఉన్నారు.

సచిన్‌ సవాల్‌

లాక్‌డౌన్‌ తర్వాత ఆన్‌లైన్‌లో మరింత బిజీ అయ్యాడు క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌.. లేటెస్ట్‌గా తెందుల్కర్‌ విసిరిన ఓ సవాల్‌ అభిమానులను అలరిస్తోంది. బ్యాట్‌ అంచుపై బంతిని నాక్‌ చేస్తూ యువరాజ్‌ చేసిన సవాల్‌కు ప్రతి సవాల్‌గా కళ్లకు గంతలు కట్టుకుని మరీ బంతిని కొడుతూ ఆశ్చర్యపరిచాడు మాస్టర్‌. 'యువీ నిన్ను తిరిగి ఛాలెంజ్‌' చేస్తున్నా అని అతను పెట్టిన పోస్టుకు లైకులే లైకులు.

గబ్బర్‌ మురళీ నాదం

మైదానంలో తొడగొడుతూ.. మీసం తిప్పుతూ అలరించే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. వేణు నాదాన్ని వినిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. పిల్లనగ్రోవి ఊదుతున్న వీడియోను అతను షేర్‌ చేయగా.. దానికి అభిమానులు బోలెడన్ని లైక్స్‌ ఇస్తున్నారు.

తెలుగుపై పడ్డాడు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ అయ్యాక ఆస్ట్రేలియా స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌కు తెలుగు మీద వల్లమాలిన అభిమానం కలిగినట్లుంది. ఒకదాని వెనుక ఒకటి తెలుగు టిక్‌టాక్‌ వీడియోలు పెడుతున్న ఈ ఓపెనర్‌.. 'బుట్ట బొమ్మ' పాటకు నాట్యం చేసి, పోకిరిలో మహేశ్‌బాబులా ఒక్కసారి కమిట్‌ అయితే అని డైలాగ్‌ చెప్పి అదరగొట్టాడు. తాజాగా అమరేంద్ర బాహుబలి.. అంటూ వదిలిన ఓ వీడియో నెట్‌ను ఊపుతోంది.

ఇదీ చూడండి..'షోయబ్​ను మిస్​ అవుతున్నా.. ఇజాన్​తోనే కాలక్షేపం'

ABOUT THE AUTHOR

...view details