న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన నాలుగో కివీస్ బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో ట్రెంట్ బౌల్ట్ 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు సౌథీ. ఈ మ్యాచ్‌కు ముందు 245 వికెట్లతో ఉన్న ఈ బౌలర్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు సౌథీ. తనతో కలిసి కొత్త బంతిని పంచుకునే మరో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 250 వికెట్ల మార్కును చేరిన మూడు రోజుల్లోనే సౌథీ ఈ మైలురాయిని అందుకున్నాడు. 67 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు.
న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన వారిలో రిచర్డ్ హ్యాడ్లీ(431) అగ్రస్థానంలో ఉన్నాడు. డేనియల్ వెటోరి(361) రెండు.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇవి చూడండి.. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్ బుమ్రా