తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ సరైన వ్యక్తి' - 'ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ సరైన వ్యక్తి'

ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఒకవేళ అదే జరిగితే తన నిషేధంపై అప్పీలు చేసుకుంటానని చెప్పాడు.

గంగూలీ
గంగూలీ

By

Published : Jun 7, 2020, 7:31 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ... ఒకవేళ ఐసీసీ చీఫ్‌గా నియమితులైతే, తన నిషేధంపై అంతర్జాతీయ క్రికెట్ మండలికి అప్పీల్‌ చేస్తానని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. ఐసీసీ, తనకు అన్ని విధాలా సహకరిస్తుందనే నమ్మకముందని చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు.

"గంగూలీ అద్భుత క్రికెటర్‌. చిన్నచిన్న విషయాలు బాగా అర్థం చేసుకుంటారు. ఐసీసీ అధ్యక్ష పదవికి అతడి కంటే సరైన వ్యక్తి ఇంకొకరు లేరు. భారత జట్టును సరైన మార్గంలో నడిపించారు. ఆ తర్వాత ధోనీ, విరాట్‌ దానిని కొనసాగిస్తున్నారు. గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ ఐసీసీ చీఫ్‌గా నియమితులైతే క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళతారు. ఆ నమ్మకం నాకుంది. ఆ పదవిని చేపట్టడానికి కావాలసిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. ఈ విషయంలో పాక్‌ బోర్డు మద్దతు అవసరం లేదు"

-కనేరియా, పాక్ మాజీ స్పిన్నర్

పాకిస్థాన్‌ తరఫున కనేరియా 261 టెస్టు వికెట్లు పడగొట్టాడు. అతడికన్నా ముందు వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు. 2012లో ఎసెక్స్‌ జట్టు తరఫున ఆడుతూ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో చిక్కుకున్నాడు. తొలుత తన నేరాన్ని అంగీకరించకపోయినా, 2018లో ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై జీవితకాల నిషేధం విధించారు.

ABOUT THE AUTHOR

...view details