టీమ్‌ఇండియాలో మార్పునకు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఉత్ప్రేరకంగా నిలిచాడని.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ చెప్పాడు.
"గంగూలీకి నేను వీరాభిమానిని. అతడు జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదిరించే ఆటగాళ్లను సిద్ధం చేశాడు. సాధారణంగా విదేశాల్లో టీమ్‌ఇండియాకు బౌన్సీ పిచ్‌లంటే ఇష్టం ఉండదు. కానీ గంగూలీ మాత్రం బౌన్సర్లకు పూర్తిగా సిద్ధమయ్యే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. భారత జట్టులో మార్పునకు గంగూలీ ఉత్ప్రేరకంగా పనిచేశాడు. అతడికి ద్రవిడ్, సచిన్ అండగా నిలిచారు. భారత క్రికెట్‌పై గంగూలీ చెరగని ముద్ర వేశాడు. ప్రపంచ స్థాయి జట్టుగా తీర్చిదిద్దాడు"