తెలంగాణ

telangana

ETV Bharat / sports

దాదా సీఏసీకి గుడ్​బై చెప్పేనా..!

బీసీసీఐ క్రికెట్​ సలహా మండలిలో సభ్యుడిగా, దిల్లీ జట్టుకు మెంటార్​గా ఉన్న గంగూలీ... ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విరుద్ధ ప్రయోజనాల అంశం కింద అభిమానుల ఫిర్యాదును పరిశీలించిన బీసీసీఐ అంబుడ్స్​మన్.. తమ ఎదుట హాజరు కావాలని ​నోటీసులు అందజేసింది.

దాదా సీఏసీకి గుడ్​బై చెప్పేనా..!

By

Published : Apr 17, 2019, 10:01 PM IST

భారత మాజీ క్రికెటర్​ సౌరభ్​ గంగూలీ క్రికెట్‌ సలహా మండలి(సీఏసీ)కి గంగూలీ గుడ్‌బై చెప్పేయనున్నట్లు తెలుస్తోంది. సీఏసీ సభ్యుడిగా, బంగాల్ క్రికెట్​​ అసోసియేషన్​కు అధ్యక్షుడిగా ఉంటూనే ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్​గా వ్యవహరిస్తున్నాడు దాదా. దీనిని విరుద్ధ ప్రయోజనాల కింద పరిగణిస్తూ నోటీసులు ఇచ్చింది బీసీసీఐ అంబుడ్స్​మన్​.

  • సౌరభ్‌కు అందజేసిన నోటీసులో...శనివారం తమ ఎదుట నేరుగా హాజరు కావాలని ఆదేశించారు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌. దీంతో గంగూలీ రెండింట్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గంగూలీ సీఏసీకి దూరమయ్యేందుకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

సౌరభ్‌ చివరిగా 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి సీఏసీ సమావేశానికి హాజరయ్యాడు. ఆ తర్వాత సీఏసీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. దాదా దిల్లీతో కొనసాగాలంటే సీఏసీకి దూరం కావాల్సిన నేపథ్యంలో ..సీఏసీకి గుడ్‌బై చెప్పి దిల్లీ జట్టుతోనే ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details