న్యూజిలాండ్ సారథి సోఫీ డివైన్ అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20ల్లో మరో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. సూపర్ స్మాష్ టోర్నీలో వెల్లింగ్టన్ జట్టు తరఫున ఆడుతున్న ఈమె.. 36 బంతుల్లో 108 పరుగులు చేసి ఈ మార్క్‌ను అందుకుంది. ఫలితంగా 2010లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ దియాండ్ర డాటిన్(38)ను అధిగమించింది. మహిళా టీ20ల్లో ఎక్కువ వేగవంతమైన శతకాలు బాదిన న్యూజిలాండ్ బ్యాట్స్ఉమన్ సుజీ బేట్స్(5), ఆస్ట్రేలియా ఓపెనర్ అలీస్సా హెలీ(5)లను కూడా దాటేసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటాగో జట్టుపై వెల్లింగ్టన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సోఫీ సెంచరీ.. టీ20ల్లో అదిరిపోయే రికార్డు
కివీస్ మహిళా క్రికెటర్ సోఫీ డివైన్ అద్భుత ఘనత అందుకుంది. మహిళల టీ20ల్లో వేగవంతమైన శతకం చేసిన బ్యాట్స్ ఉమన్‌గా నిలిచింది.
సోఫీ డివైన్
ఈ లీగ్ పూర్తవగానే న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
ఇదీ చూడండి : గేల్, రోహిత్, మెకల్లమ్‌కు సాధ్యం కానీ ఘనత ఆమె సొంతం