లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో తిరిగి ప్రారంభం కావాల్సిన '3టీ క్రికెట్' పోటీ జులై 18కి వాయిదా పడింది. స్వదేశానికి చెందిన 24 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. జూన్ 27న ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంకొంత సమయం అవసరమని సఫారీ క్రికెట్ బోర్టు(సీఎస్ఏ) భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
"టీవీ స్క్రీన్‌పై మళ్లీ క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. కరోనా వైరస్‌తో ప్రభావితులైన వారికి నిధులు సేకరించడమే ఈ టోర్నీ ప్రధాన లక్ష్యం. అందుకు జులై 18న నెల్సన్ మండేలా జయంతి కంటే మంచి రోజు ఉంటుందని నేను అనుకోవడం లేదు. మ్యాచ్‌కు ఇంకా మూడు వారాలు ఉంది. కాబట్టి ఆటగాళ్లు మెరుగయ్యేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది."
డా.జాక్వెన్ ఫాల్, సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్