ప్రస్తుత ప్రపంచకప్లో వరుస విజయాలు సాధిస్తోంది టీమిండియా. ఇలాంటి సమయంలో గాయాల కారణంగా జట్టులోని ధావన్ టోర్నీ మొత్తానికి, భువనేశ్వర్ కుమార్ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యారు. అయినప్పటికీ భారత జట్టు సెమీస్ చేరుకుంటుందని చెప్పాడు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.
"గాయాలు కావడమనేది సహజం. వాటిని ఎవరూ నియంత్రించలేరు. భువీ స్థానంలో బౌలింగ్ చేసిన విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. సునాయసంగా సెమీస్ చేరుకుంటుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కంటే అత్యుత్తమంగా కనబడుతోంది." -సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ ఆటగాడు