తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత అంపైర్​కు పదేళ్లు పడుతుంది: టాఫెల్​ - సైమన్ టాఫెల్ భారత అంపైర్లు

ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్​లో ఓ భారతీయుడు.. అంపైర్​గా రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందని మాజీ అంపైర్ సైమన్ టాఫెల్ చెప్పాడు. నూతన అధ్యక్షుడు గంగూలీ ఈ అంశంపై దృష్టి సారించాలని అన్నాడు.

simon taufel says indian umpires got 10 years to be a part of ICC elite umpire panel
భారత అంపైర్​కు పదేళ్లు పడతుంది: టాఫెల్​

By

Published : Nov 26, 2019, 7:51 PM IST

Updated : Nov 26, 2019, 9:55 PM IST

భారత్​ నుంచి సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి అంపైర్‌ ఒక్కరైనా వస్తారని తాను అనుకోవడం లేదని మాజీ అంపైర్‌ సైమన్‌ టాఫెల్‌ అన్నాడు. ఐసీసీ అంపైర్ల ఎలైట్‌ ప్యానెల్‌లోకి ఓ భారతీయుడు ప్రవేశించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని, బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలని తెలిపాడు.

"భారత్ నుంచి ప్రపంచ స్థాయి అంపైర్‌ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్​లో ఈ కార్యక్రమాన్ని 2006 నుంచి 2016 వరకు నిర్వహించాం. ఎలైట్‌ ప్యానెల్లోకి ఎస్‌.రవి అడుగుపెట్టేందుకు కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై మళ్లీ ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు జరుగుతోందని అనుకోను. కానీ భారత్‌కు అంపైర్లు అవసరం" -సైమన్ టాఫెల్, మాజీ అంపైర్

బీసీసీఐ నూతన అధ్యక్షుడైన సౌరభ్ గంగూలీ ఈ అంశంపై దృష్టిపెట్టాలని అన్నాడు టాఫెల్.

"దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న గంగూలీ, ఈ విషయంపైనా దృష్టిసారించాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్స్‌ మేనేజర్‌, అంపైర్స్‌ కోచ్‌, అంపైర్స్‌ ట్రైనర్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలి. అందరూ సురక్షితంగా ఉండే, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థను ఏర్పాటు చేయాలి" -సైమన్ టాఫెల్, మాజీ అంపైర్

ఎస్‌.రవి.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోకి 2015లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో అతడిని తొలగించారు. యాషెస్‌ సహా 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20లకురవి అంపైరింగ్‌ చేశాడు.

ఇదీ చదవండి: వచ్చే ఐపీఎల్ తర్వాతే భవిష్యత్​పై ధోనీ నిర్ణయం!

Last Updated : Nov 26, 2019, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details