తెలంగాణ

telangana

ETV Bharat / sports

దూబే... యువరాజ్​లా ఆడుతున్నాడే.. - "Shivam Dube Next Yuvraj Singh?"says fans

భారత యువ ఆటగాడు శివం దూబే నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది బీసీసీఐ. అతడి ఆట యువరాజ్​లా ఉందంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

దూబే

By

Published : Nov 3, 2019, 12:15 PM IST

శివమ్‌ దూబే.. భారత్-బంగ్లాదేశ్‌ మధ్య జరిగే టీ20 సిరీస్​కు ఎంపికైన ముంబయి క్రికెటర్‌. లెఫ్ట్‌ హ్యాండ్‌ హార్డ్‌ హిట్టర్‌, రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌. టీమిండియా ఆల్​రౌండర్​ హార్దిక్‌ పాండ్య గాయం కారణంగా ఇతడికి అవకాశమిచ్చారు సెలక్టర్లు. ఈ ఆటగాడి గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అందుకు కారణం బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియో.

బంగ్లాదేశ్​తో తొలి టీ20 నేడు దిల్లీ వేదికగా జరగనుంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమించారు. దూబే కూడా నెట్స్​లో కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు ఆడిన షాట్​లను ఓ 20 సెకన్ల వీడియోగా రూపొందించి.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది బీసీసీఐ. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. దూబే ఆట మరో యువరాజ్​లా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఇతడికీ యువీకి కొంచెం ఆటలో పోలికలు ఉన్నాయి.

యువీలాగే ఎడమచేతి వాటం బ్యాట్స్​మన్​ అయిన దూబే... ఆరడుగుల ఎత్తు ఉంటాడు. గతంలో యువరాజ్​ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా... ఈ యువ క్రికెటర్​ఓ టెస్టు మ్యాచ్​లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు.

దూబేపై ట్వీట్స్

ఇవీ చూడండి.. టీ20 ప్రపంచకప్​ క్వాలిఫయర్ విజేతగా నెదర్లాండ్

ABOUT THE AUTHOR

...view details