తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచి కొట్టిన దూబే.. భారత్​ స్కోరు 170/7 - west indies vs india 2019

విండీస్​తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాట్స్​మెన్ తడబడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేశారు. శివమ్ దూబే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

shivam dube half centuary, india scored
శివమ్ దూబే

By

Published : Dec 8, 2019, 8:48 PM IST

వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టీ20లో భారత్​ 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టీమిండియా యువ బ్యాట్స్​మన్ శివమ్ దూబే(54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రిషభ్ పంత్(33) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరో 2 వికెట్లతో రాణించగా.. పియర్రే, జేసన్ హోల్డర్, కాట్రెల్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్(11) వికెట్ కోల్పోయింది. తర్వాత విరాట్ స్థానంలో వచ్చిన శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్(15) సాయంతో ఇన్నింగ్స్​ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అప్పుడే కుదురుకున్నాడనుకున్నా హిట్​మ్యాన్..​ హోల్డర్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు.

దూబే అర్ధశతకం..

ఆరంభంలో నిదానంగా ఆడినప్పటికీ అనంతరం బ్యాట్​ ఝుళిపించాడు దూబే. పొలార్డ్ వేసిన తొమ్మిదో ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి యువరాజ్​సింగ్​ను గుర్తు చేశాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో వాల్ష్ బౌలింగ్​లో హేడెన్​కు క్యాచ్​ ఇచ్చాడు.

చివర్లో టపాటపా..

తొలి టీ20లో 94 పరుగులతో విధ్వంసం సృష్టించిన విరాట్.. ఈ మ్యాచ్​లో తడబడ్డాడు. 17 బంతుల్లో 19 పరుగులే చేసి.. విలియమ్స్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. అక్కడ నుంచి టీమిండియా స్కోరు వేగం మందగించింది. చివర్లో వరుస వికెట్ల కోల్పోయీ అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.

అగ్రస్థానంలో విరాట్​..

టీ20ల్లో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​లో విరాట్ కోహ్లీ(2563) అగ్రస్థానంలోకి వచ్చాడు. రోహిత్ శర్మ(2562), మార్టిన్ గప్తిల్(2436), షోయబ్ మాలిక్​లు(2263) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి: దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్​కు స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details