ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ నెంబర్‌వన్ ర్యాంకును తిరిగి దక్కించుకుంది. సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో సత్తాచాటిన ఈ విధ్వంసకర ఓపెనర్ మరోసారి టాప్ ర్యాంకును సాధించింది. ప్రస్తుతం షెఫాలీ ఖాతాలో 750 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ 748 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాగా, భారత్ నుంచి స్మృతి మంధాన, రోడ్రిగ్స్ వరుసగా 7,9 ర్యాంకుల్లో నిలిచారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానానికి షెఫాలీ - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ అగ్రస్థానానికి చేరుకుంది. ఆసీస్‌కు చెందిన బెత్ మూనీని అధిగమించి టాప్కు వెళ్లింది.
అగ్రస్థానానికి షెఫాలీ
బౌలర్ల విభాగంలో టీమ్ఇండియా నుంచి దీప్తి శర్మ, రాధా యాదవ్ వరుసగా 7,8 ర్యాంకుల్లో నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లిస్టోన్ 799 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆల్‌రౌండర్ల విభాగంలో టీమ్ఇండియాకు చెందిన దీప్తిశర్మ 4వ ర్యాంకులో నిలవగా న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ అగ్రస్థానం కాపాడుతుంది.