తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే సిరీస్​: భువి పోయే.. శార్దుల్ వచ్చే - భారత్ - వెస్టిండీస్​

వెన్నునొప్పి కారణంగా విండీస్​తో మూడు వన్డేల సిరీస్​కు టీమిండియా బౌలర్​ భువనేశ్వర్ కుమార్​ దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దుల్ ఠాకుర్​ను ఎంపిక చేసింది బీసీసీఐ.

Shardul Thakur to replace Bhuvneshwar Kumar in India ODI squad for West Indies series
వన్డే సిరీస్​: భువి పోయే.. శార్దుల్ వచ్చే

By

Published : Dec 14, 2019, 10:17 AM IST

అనుకున్నట్లే జరిగింది.. గాయం కారణంగా వెస్టిండీస్​తో వన్డే సిరీస్​కు దూరమైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్ ఠాకుర్​ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ విషయాన్ని అధికారికంగా శనివారం ప్రకటించింది.

" రేపటి(ఆదివారం) నుంచి చెన్నై వేదికగా వెస్టిండీస్​తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్​కు భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్​ ఠాకుర్​ను ఎంపిక చేశాం" -బీసీసీఐ ట్వీట్​

యాజమాన్యానికి ఫిర్యాదు..!

విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు భువీ. ఇటీవలే వెన్ను నొప్పి వల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకుని ఒక సిరీస్‌ ఆడాడో లేదో మళ్లీ గాయం తిరగబెట్టింది.

వెస్టిండీస్​తో వన్డే సిరీస్​కు భారత జట్టు..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(కీపర్), శివమ్ దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకుర్.

వెస్టిండీస్​తో​ మూడు వన్డేల సిరీస్​ ఆడనుంది టీమిండియా. తొలి వన్డే చెన్నై వేదికగా డిసెంబరు 15న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ విశాఖలో డిసెంబరు 18న జరగనుంది. మూడో వన్డే కటక్ వేదికగా డిసెంబరు 22న నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: 'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు'

ABOUT THE AUTHOR

...view details