పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు 35 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. క్వైద్-ఈ- ఆజామ్ ట్రోఫీలోని ఓ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి అతడిని దూషించాడమే ఇందుకు కారణమని పేర్కొంది. సింధ్ ఫస్ట్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్.. శనివారం జరిగిన మ్యాచ్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు.
అంపైర్లపై సర్ఫరాజ్ అసభ్యకర వ్యాఖ్యలు - ఎంపైర్ నిర్ణయంపై అసభ్య పదజాలం
పాక్ దేశవాళీ టోర్నీలో భాగంగా ఓ మ్యాచ్‌లో అంపైర్‌పై అసభ్యపదజాలం ఉపయోగించాడు సీనియర్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్. దీంతో బోర్డు అతడి మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత విధించింది.
ఎంపైర్ నిర్ణయాన్ని పలుమార్లు దూషించిన సర్ఫరాజ్
"అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. పలుమార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంపైర్లుగా ఉన్న ఫైజల్ అఫ్రిది, సకిబ్ ఖాన్ పాకిస్థాన్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం సర్ఫరాజ్ నిబంధనలు ఉల్లంఘించాడు" అని పీసీబీ తెలిపింది.
ఇదీ చదవండి:స్మిత్ ఆవలింతపై సర్ఫరాజ్ భార్య ట్వీట్