ఐపీఎల్ 12వ సీజన్లో మొదటి హ్యాట్రిక్ నమోదైంది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు సామ్ కరాన్ ఈ ఘనత సాధించాడు. ఈ యువ ఆటగాడి అద్భుత ప్రదర్శనతో పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సామ్ అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302 రోజులు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.
"హ్యాట్రిక్ సాధిస్తానని అనుకోలేదు. ప్రేక్షకుల అరుపుల మధ్య నా మాటలు నేనే వినలేకపోయా. అశ్ చెప్పినట్లు బౌల్ చేశా. షమి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మాకిది గొప్ప విజయం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించేందుకు కష్టపడతా.
సామ్ కురాన్, పంజాబ్ ఆటగాడు
హ్యాట్రిక్ సాధించాడిలా..
సోమవారం జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్. చివరి బంతికి హర్షల్‌ను ఔట్ చేసిన కరన్..20 ఓవర్ తొలి రెండు బంతులకు రబాడ (0), లమిచానే (0)లను క్లీన్ బౌల్డ్ చేసి సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఇవీ చూడండి..'బాస్కెట్‌బాల్'లో ఈ రోబోతో పోటీ పడగలరా!