లాక్డౌన్ తర్వాత ఐపీఎల్ కోసం మైదానంలో మళ్లీ ప్రాక్టీస్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్. ఈ నిర్బంధ సమయం వల్ల క్రికెటర్లకు మంచి, చెడు.. రెండూ జరిగాయని వివరించాడు. అంతకుముందు గాయాలతో ఉన్న కొంతమంది ఆటగాళ్లు ఈ ఐదు నెలల్లో పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ను సంపాదించుకున్నారని చెప్పాడు. కానీ మరికొంతమంది మాత్రం ఆటపై పట్టు కోల్పోయి ఉండొచ్చన్నాడు. దీంతోపాటు బయో బుడగలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడం సరైందని అభిప్రాయపడిన భువీ.. తమ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌తో మంచి స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చాడు.
'ఉమ్మి నిషేధం వల్ల రివర్స్ స్వింగ్ కష్టమే'
ఉమ్మి నిషేధం రివర్స్ స్వింగ్‌పై భారీగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. లాక్డౌన్ వల్ల ఆటగాళ్లకు మంచి, చెడు రెండూ జరిగాయని చెప్పిన ఇతడు.. ఈ ఐపీఎల్ 13వ సీజన్ బయోబబుల్‌లో నిర్వహించడం సరైందన్నాడు.
భువనేశ్వర్ కుమార్
అలాగే బంతిపై ఉమ్మి వాడడాన్ని ఐసీసీ బ్యాన్ చేయడం వల్ల బౌలర్లపై పెద్దగా ప్రభావం చూపదని అన్నాడు భువీ. కానీ బంతి రివర్స్ సింగ్ అవ్వడం కష్టమని చెప్పాడు. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. ప్రస్తుతం క్రికెటర్లందరూ టోర్నీలో గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు.
ఇదీ చూడండి 'రఫేల్ రాకతో వాయుసేన బలం మరింత పెరిగింది'