తెలంగాణ

telangana

ETV Bharat / sports

మన కోచ్​లకు జీతాలు పెరిగినయ్..!

టీమిండియా కోచ్​గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి.. అతడి సహాయ సిబ్బందికి జీతాలను పెంచింది బీసీసీఐ.  ప్రధాన కోచ్​ ఖాతాలో రూ. 10 కోట్లకు చేరే అవకాశముంది.

రవిశాస్త్రి

By

Published : Sep 9, 2019, 10:21 PM IST

Updated : Sep 30, 2019, 1:36 AM IST

ప్రపంచకప్​ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్​, సహాయ సిబ్బందిని ఇటీవలే బీసీసీఐ నియమించింది. తాజాగా వీరి జీతాలనూ పెంచిందని సమాచారం. ప్రధాన కోచ్ రవిశాస్త్రి వార్షిక జీతం రూ.10 కోట్లకు చేరే అవకాశం ఉంది.

ఇటీవల రెండోసారి కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరిగే టీ20 ప్రపంచకప్​ వరకు సేవల్ని అందించనున్నాడు. ప్రస్తుతం అతడికి ఏడాదికి రూ. 8 కోట్ల వరకు జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచింది. అంటే దాదాపు రూ. 1.5 కోట్ల వరకు పెరగనుంది. ఫలితంగా ఏడాదికి రూ. 9.5- 10 కోట్ల మధ్య వేతనం వచ్చే అవకాశం ఉంది.

సంజయ్‌ బంగర్‌ స్థానంలో ఎంపికైన నూతన బ్యాటింగ్ కోచ్​ విక్రమ్‌ రాఠోడ్‌ వార్షిక వేతనంగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లు అందుకోనున్నాడు. ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వార్షిక వేతనాలూ పెరిగాయి. వారు ప్రస్తుతం ఏడాదికి రూ. 3.5 కోట్ల వరకు తీసుకోనున్నారని సమాచారం. పెంచిన జీతాలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇటీవల జరిగిన వెస్టిండీస్​ పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ విజేతగా నిలిచిన టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్​ కోసం సమాయత్తమవుతోంది. సఫారీ జట్టుతో మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది కోహ్లీ సేన.

ఇదీ చదవండి: పాకిస్థాన్​లో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్ల విముఖత

Last Updated : Sep 30, 2019, 1:36 AM IST

ABOUT THE AUTHOR

...view details