క్రికెట్ గాడ్ సచిన్‌కు కార్లంటే ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. తాజాగా చోదక రహిత కారును సొంతం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. ఆ కార్లో కూర్చుని తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు సచిన్.
"గ్యారేజ్‌లో నా కారు తనంతట అదే పార్కింగ్ చేసుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంది. చూస్తుంటే మిస్టర్ ఇండియా కారును కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వారాంతం నా స్నేహితులతో గడిపే సయమం ఎంతో ఉత్సాహంగా ఉండబోతోంది". అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.