"నా కోసం కూడా ఓ రెండు మూడు నిమ్మకాయలు కోయగలవా" అంటున్నాడు టీమ్ఇండియా వెటరన్ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్‌సింగ్. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా? ఇంకెవర్నీ? దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌నే అడిగాడు. వెదురు కర్రను ఉపయోగించి చెట్టుకున్న నిమ్మకాయలను మాస్టర్ కోస్తున్న పాత వీడియోను భజ్జీ ట్వీట్ చేశాడు.
'మై ఫ్రెండ్.. మామిడికాయ కాదు నిమ్మకాయ'
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను షేర్ చేశాడు హర్భజన్ సింగ్. అందులో సచిన్ నిమ్మకాయలు కోస్తూ కనిపించాడు.
సచిన్
నిమ్మకాయలు కోస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి పొరపాటున అది మామిడి పండా అని అడగ్గా "ఇది మామిడి కాదు. నిమ్మ.. నిమ్మకాయ" అంటూ సచిన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు క్రికెటర్లు. ఇటీవల తన తనయుడు అర్జున్‌కు హెయిర్ కట్ చేసి ఆ వీడియోను నెట్టింట షేర్ చేశాడు మాస్టర్.