బ్యాట్లకు మరమ్మత్తులు చేయడం అష్రాఫ్ చౌదరి పని. సచిన్, కోహ్లీ సహా ఎంతో మంది క్రికెటర్ల బ్యాట్లకు మరమ్మతులు చేశాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి సచిన్ అండగా నిలిచాడు.
అష్రాఫ్‌కు సచిన్ ఆర్థిక సహాయం - సచిన్ తెందుల్కర్ తాజా వార్తలు
అనారోగ్యంతో ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్న బ్యాట్లు రిపేర్ చేసే అష్రాఫ్‌కు సచిన్ ఆర్థిక సహాయం చేశాడు.
"అష్రాఫ్ చాచాను ఆదుకోవడానికి సచిన్ ముందుకొచ్చాడు. అతడికి ఆర్థిక సహాయం కూడా చేశాడు" అని అష్రాఫ్ స్నేహితుడు ప్రశాంత్ చెప్పాడు. వాంఖడేలో ఎప్పుడూ అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినా అష్రాఫ్ స్టేడియంలో ఉండేవాడు. క్రికెటర్ల బ్యాట్లకు అవసరమైతే వెంటనే మరమ్మతులు చేసేవాడు. స్టీవ్ స్మిత్, క్రిస్‌గేల్, పొలార్డ్ లాంటి వారు కూడా అతడి వద్ద బ్యాట్లను బాగు చేయించుకున్నారు. క్రికెట్ వర్గాల్లో అష్రాఫ్ చాచాగా పేరున్న అష్రాఫ్‌కు ఓ క్రీడా పరికరాల దుకాణం ఉంది. కానీ ప్రస్తుతం అది సరిగా నడవట్లేదు.