అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ధోని నిదానంగా ఆడటాన్ని తప్పుపట్టిన సచిన్ బంగ్లాతో మ్యాచ్‌లో మహీ ప్రదర్శనను సమర్థించాడు. జట్టుకు ఏది సరైనదో ధోని అదే చేశాడని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
"బంగ్లాతో ధోని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు ఏది సరైనదో అదే చేశాడు. అతడు 50వ ఓవర్ వరకు ఉండి ఉంటే మిగతా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడే. మహీ కూడా అదే అనుకుని ఉంటాడు" - సచిన్ తెందూల్కర్