ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రక గెలుపు తర్వాత స్ఫూర్తిదాయక ట్వీట్ చేశారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. అపజయాలతో కుంగిపోవద్దని, ఆపదలో దన్నుగా నిలచినవారితో విజయోత్సవాలను జరపుకోవాలని సూచించారు.
"భారత్‌కే కాదు, ప్రపంచానికి ఓ విషయం చెబుతున్నా. మీరు 36 పరుగులు లేదా అంతకంటే తక్కువ స్కోరుకు వెనుదిరిగితే.. అది అంతం కాదు. మరింత గొప్పగా దూసుకెళ్లడానికే కాస్త వెనక్కి వెళ్తున్నారంతే. అయితే గెలిచిన తర్వాత మీకు అండగా నిలిచిన వాళ్లతో సంబరాలు చేసుకోవడం మరిచిపోవద్దు."
-సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్