తెలంగాణ

telangana

ETV Bharat / sports

రొనాల్డో నాకు స్ఫూర్తినిచ్చాడు: విరాట్​ కోహ్లీ

ప్రముఖ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో ముందు వరుసలో ఉంటాడని చెప్పాడు క్రికెటర్​ విరాట్ కోహ్లీ.

'ఫుట్​బాలర్ రొనాల్డో నాకు స్ఫూర్తినిచ్చాడు'

By

Published : Aug 3, 2019, 9:00 AM IST

స్టార్​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో తనకు స్ఫూర్తినిచ్చాడని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడి గురించి మరిన్ని విషయాలు పంచుకున్నాడు.

" నాకు క్రిస్టియానో రొనాల్డో స్ఫూర్తి. పని పట్ల నిబద్ధతను అతడు ఆడే ప్రతీ మ్యాచ్​లోనూ చూపిస్తాడు. దాన్ని అందుకోవలంటే కష్టం. రొనాల్డో ఆడే ప్రతీ క్లబ్​ను నేను అభిమానిస్తా." -విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

క్రిస్టియానో రొనాల్డో

అదే విధంగా మెస్సీ-రొనాల్డోలలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు విరాట్.

లియోనల్​ మెస్సీ- క్రిస్టియానో రొనాల్డో

"ఎక్కువగా సవాళ్లను స్వీకరించి విజయవంతమైన వారిలో అందరి కంటే రొనాల్డో ముందున్నాడనేది నా అభిప్రాయం. నేను చూసిన వారిలో అతడో సంపూర్ణ ఆటగాడు.దీనికి తోడు అద్భుతమైన సారథి కాబట్టి అతడంటే నాకు అమితమైన ఇష్టం." -విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

వీరిద్దరే కాకుండా జర్మన్ గోల్​ కీపర్ ఒలివర్ కాన్, క్రోయేషియా కెప్టెన్ లుకా మొద్రిక్, స్పానిష్ ద్వయం ఆండ్రెస్ ఇనైస్టా, క్జావీల ఆటను చూస్తూ పెరిగానని చెప్పాడు విరాట్ కోహ్లీ. అదే విధంగా 1998, 2002 ఫుట్​బాల్​ ప్రపంచకప్​లు చూడటం తన జీవితంలో మర్చిపోలేని అనుభవాలని అన్నాడు.

ప్రస్తుత భారత ఫుట్​బాల్ టీమ్​కు నాయకత్వం వహిస్తున్న సునీల్​ ఛెత్రిపై ప్రశంసలు కురిపించాడు విరాట్.

"గత నాలుగైదేళ్లలో మన ఫుట్​బాల్​ జట్టు బాగా మెరుగుపడింది. కొత్త ఆటగాళ్ల రాకతో పటిష్ఠంగా తయారవుతోంది. ముందుండి నడిపిస్తున్న ఛెత్రి.. కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఫుట్​బాల్​ ప్రపంచకప్​ ఆడేందుకు అన్ని అర్హతలు సునీల్​ ఛెత్రికి ఉన్నాయి. అతడో నిజమైన ఛాంపియన్." -విరాట్​ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

ప్రస్తుతం వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న విరాట్​ సేన.. శనివారం తొలి టీట్వంటీ ఆడనుంది. ఇప్పటికే మ్యాచ్​కు ఆతిథ్యమిస్తున్న ఫ్లోరిడాకు చేరుకుంది. వీటితో పాటు వన్డే,టెస్టు సిరీస్​లు ఆడనుంది టీమిండియా.

ఇది చదవండి: రోహిత్​శర్మను ఊరిస్తున్న మరో రికార్డు

ABOUT THE AUTHOR

...view details